గీసుకొండ : బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు శాంతియుతంగా జరుపుకోవాలని స్థానిక సీఐ విశ్వేశ్వర్ సూచించారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో మత పె ద్దలతో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, వదంతులను ప్రచారం చేయవద్దని ఆయన కోరారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా వ్యవహరించాలని, చట్టాలకు, నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. కాగా పండుగ సహృద్భావ వాతావరణంలో జరిగేలా తమ సహకారం ఉంటుందని మత పెద్దలు ఈ సందర్బంగా పోలీసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సైలు కుమార్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
సీఐ విశ్వేశ్వర్


