మొరం తరలింపుపై కలెక్టర్‌కు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

మొరం తరలింపుపై కలెక్టర్‌కు ఫిర్యాదు

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

పర్వతగిరి : మండలంలోని కల్లెడ గ్రామంలో అక్రమంగా మొరం తరలింపుపై జిల్లా కలెక్టర్‌ సత్యశారదకు కల్లెడకు చెందిన కొంత మంది రైతులు అక్రమ మొరం తరలింపును అడ్డుకోవాలని ఫిర్యాదు చేశారు. పది రోజులుగా గ్రామ శివారు ఆవకుంట నుంచి జేసీబీ సాయంతో 15 ట్రాక్టర్ల ద్వారా మొరం అమ్ముకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే స్పందించి అక్రమ మొరం అడ్డుకోవాలని రైతులు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ స ర్పంచ్‌ చిన్నపాక శ్రీనివాస్‌, రైతులు ఎర్రబెల్లి ప్రకాశ్‌రావు, ఎర్రబెల్లి కిషన్‌రావు, కొత్తపల్లి యశోద, కారుపోతుల శ్రీనివాస్‌, మేడి రామకృష్ణ, జీవన్‌జీ యాదగిరి, నక్క రాములు, తక్కళ్లపల్లి దే వేందర్‌రావు, పూర్ణచందర్‌రావు, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement