చెన్నారావుపేట: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని చెన్నారావుపేట సర్పంచ్ శ్వేత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నేడు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వం పాఠశాలలను తీర్చిదిద్దుతుందని, అందుకు అనుగుణంగా తల్లితండ్రులు ప్రభుత్వానికి అండగా నిలబడాలని సూచించారు. మండల కేంద్రంలోని నంబర్ 1 కాలనీ, ఇతర కాలనీల నుంచి విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలకు పంపిస్తే తాము ఆటో ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచి దొంతి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


