పర్వతగిరి: ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎస్సీ కార్పొరేషన్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ సొసైటీ 2025–26 సంవత్సరానికి గాను మండలానికి కేటాయించిన టార్గెట్‌ను అనుసరించి అర్హత గల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి టీఎస్‌ఓబీఎంఎంఎస్ అప్‌లై చేసుకున్న దరఖాస్తుదారులకు కన్వీనర్, మండల కమిటీ చైర్మన్ ఎంపీడీఓ శంకర్‌నాయక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు ఐఓబీ, పీఎన్‌బీ, ఎస్‌బీఐ నెక్కొండ బ్యాంకు, కెనరా బ్యాంకు అన్నారం బ్యాంకు అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ రిప్రజేంటివ్ నబీ, పంచాయతీ కార్యదర్శి శేషాంజన్‌స్వామి, తహసీల్దార్ వెంకటస్వావి పాల్గొన్నారు.
మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
పర్వతగిరి: మండలంలోని గోరుగుట్టతండా సర్పంచ్ విజయలక్ష్మిభాస్కర్ గ్రామీణ ఉపాధి హామీ కూలీలు, ఐకేపీ సెంటర్ హమాలీలు, రైతులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంటాలు, ఉపాధి కూలీల హాజరు జాబితాలను పరిశీలించారు. సంబంధిత అధికారులు ఎండలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం వేళల్లో పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దేవేందర్, వార్డు మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షుడు వాగ్యనాయక్, యూత్ నాయకులు నెహ్రూసుమన్, సంతోష్, వీరకుమార్, రాజు, ఐకేపీ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.
రేపు పాలకుర్తిలో జాబ్‌మేళా
రాయపర్తి : పాలకుర్తి మండలకేంద్రంలోని సోమేశ్వర కల్యాణ మండపం వ ద్ద హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్‌రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించే ఫ్రీ జాబ్‌మేళాను సద్వి నియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌మేళాను యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోస్టర్‌లో ఉన్న క్యూ ఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తాటివనం తగులబెట్టిన వారిపై చర్య తీసుకోవాలి
చెన్నారావుపేట : మండలంలోని లింగగిరి గ్రామంలో తాటి వనం తగులబెట్టిన వారిపై చర్య తీసుకోవాలని లింగగిరి గౌడ సంఘం అధ్యక్షుడు పులి రమేశ్ డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన కడగండ్ల పెద్ద యాకయ్య ఇష్టారాజ్యంగా తాటి చెట్లను తగులబెట్టాడని ఆయన తప్పిదంతో వనంలో తాటి చెట్లు ఎక్కువమొత్తంలో తగలబడి పోయాయన్నారు. గీత కార్మికులకు జీవనోపాధి కల్పించే తాటి చెట్లను తగులబెట్టడం వల్ల వారి కుటుంబ పోషణకు నష్టం కలిగినట్లు తెలిపారు.
ధాన్యం బస్తాలు మాయం
నర్సంపేట రూరల్ : మండలంలోని భాంజీపేటకు చెందిన రైతు కుమారస్వామి నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కు నెలరోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కొనుగోలు కేంద్రాల్లో మక్కల ధాన్యం నిల్వలు పేరుకపోవడంతో కొనుగోళ్లలో జా ప్యం జరుగుతూ వచ్చింది. ఈనెల 18న కు మారస్వామి తెచ్చిన 168 బస్తాల మక్కలలో 41 మంచి బస్తాలు మాయం అయ్యాయి. వెంటనే అధికారులకు, పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రైతు కుమారస్వామి రోదిస్తూ తెలిపారు. ఈ విషయమై ఎస్సై గూడ అరుణ్‌ను వివరణ కోరగా మక్కల ధాన్యం బ స్తాలు దొంగతనం జరిగినట్లు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే కేసు న మోదు చేసుకొని విచారణ చేపడుతామన్నారు.
మాయం వెనకాల ఎవరి హస్తం...?
మార్కెట్‌లో నెలరోజులు మక్కజొన్న బస్తాలు కొనుగోలు జరుగక అలాగే ఉంటున్నాయి. కొనుగోలు జరిగినప్పటికీ వాటిని లిఫ్ట్ చేయడంలో ఆలస్యం జరుగుతోంది. బస్తాలను మా యం చేయడంలో స్థానికులు ఎవరైనా చేశారా... లేకపోతే దళారీలు చేసిన పనా తెలియాల్సి ఉంది.


