సంగెం : ఆరుగాలం శ్రమకోర్చి పండించిన ధాన్యంను తరుగుపెరుతో మిల్లర్లు దోచుకోవడాన్ని అరికట్టాలని అఖిల భారత కిసాన్ పెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని ఎల్గూర్‌రంగంపేటలో సొసైటీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బస్తాకు 43 కిలోల చొప్పున కాంటాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిల్లర్లతో సెంటర్ నిర్వహకులు కుమ్మకై ్క బస్తాకు 41 కిలోలు కాంటా వేయాల్సి ఉండగా రైతులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సెంటర్ల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. రైతులు సొంత ఖర్చులు వెచ్చించి రైస్ మిల్లులకు తరలిస్తున్నారని ట్రాన్స్‌పోర్టు చార్జీలను రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కన్వీనర్ గోనే రాంచందర్, శ్రీనివాస్, అశోక్, రవి, రామారావు, ఐలయ్య, కొమురయ్య, పాల్గొన్నారు.
ధాన్యం తడవకుండా
చూసుకోవాలి
దుగ్గొండి : వాతావరణంలో మార్పులు వచ్చాయి. వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్నదాతలు తాము పండించిన మొక్కజొన్న, ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్తగా టార్పాలి న్ కప్పుకుని రక్షించుకోవాలని మండల వ్యవసాయ అధికారి గాజుల శ్యామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా రైతులు పంటలు కోయకుండా ఉంటే వాయిదా వేసుకోవాలన్నారు. వర్షం తగ్గిన తర్వాత కోతలు ప్రారంభించాలని పేర్కొన్నారు.
కనులపండువగా
పెద్దమ్మ బోనాలు
చెన్నారావుపేట : ముదిరాజుజ్ కులస్తుల ఆరాధ్యవం పెద్దమ్మ తల్లికి బుధవారం ఆ కులస్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. గత ఏడాది వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి పెద్ద పండుగ చేసిన విషయం తెల్సిందే. వా 0ర్షికోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామంలోని కులస్తులు బోనాలు చేసి డప్పువాయిద్యాలతో అమ్మవారికి నైవేధ్యం సమర్చించారు. కార్యక్రమంలో కుల పెద్దలు మహేందర్, నరేష్, వీరభద్రయ్య, మాజీ సర్పంచి విజయరామరాజు,విజయ్, నరేందర్, భాస్కర్, సంతోష్,తదితరులు పాల్గొన్నారు.


