గీసుకొండ : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) ఆధ్వర్యంలోని స్థానిక ప్రగతి మండల సమాఖ్య ఐక్యతతో ఆర్థికంగా ప్రగతిపథంలో నడవాలని సె ర్ఫ్ ఏపీఎం ముక్కెర ఈశ్వర్ అన్నారు. బుధవారం కొనాయమాకులలో సర్వసభ్య సమావేశం అధ్యక్షురాలు గట్టు రాధిక అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ రానున్న ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి రుణాలను రూ.150 కోట్ల మేర అందించాలన్నారు. సమైఖ్య ఆర్థికంగా బ లో పేతం అవుతూనే పేదల సంక్షేమం కోసం కృషి చే యాలన్నారు. ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలకు రు ణాలను అందించడం, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ తీసుకోవడం లాంటి విషయాలపై సమావేశంలో తీర్మానించారు. గత ఏడాది ఆర్థికలావాదేవీలను కోశాధికారి శిల్ప చదివి వినిపించారు.వీఓలు పద్మావతి, వాణి, స్వర్ణలత, ఉష పాల్గొన్నారు.
సంఘాల బలోపేతానికి కృషి
ఖానాపురం : మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలని ఎంపీడీఓ అద్వైత సూచించారు. మండల కేంద్రంలోని చైతన్య మండల సమాఖ్య కార్యాలయంలో వార్షిక మహాసభను బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మహిళా సంఘాలు దో హదపడతాయన్నారు. అనంతరం ఉత్తమ వీఓ అధ్యక్షులను సన్మానించారు. ఏపీఎం రమాదేవి, మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి, కార్యదర్శి శిరీష, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


