సబ్సిడీలో జీలుగ విత్తనాలు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీలో జీలుగ విత్తనాలు పంపిణీ

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

సంగెం : సబ్సిడీపై పచ్చిరొట్ట జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయాధికారి జగదీశ్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని తీగరాజుపల్లిలోని ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రంలో 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. భూమి సారాన్ని పెంపొందించేందుకు, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంట దిగుబడులు అధికం చేయడానికి ప చ్చిరొట్ట సాగు చేసుకోవాలన్నారు. రసాయనిక ఎ రువుల వాడకం తగ్గించడం వల్ల పెట్టుబడి తగ్గుతుందన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు ప ట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌ తీసుకుని సంబంధిత క్లస్టర్‌ వ్యవసాయవిస్తరణాఽధికారి వద్ద పర్మిట్‌ పొందాలన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

గీసుకొండ : ప్రభుత్వం సబ్సిడీపై అందించే జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఊకల్‌ సొసైటీ చైర్మన్‌ బొమ్మల రమేశ్‌ అన్నారు. బుధవారం సొసైటీ వద్ద రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకం వల్ల రైతులకు పెట్టుబడి బారం ఎక్కువ అవడంతో పాటుగా భూములు నిస్సారం అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మున్నంగి జనార్ధన్‌, సీఈఓ రమేష్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement