పంట పొలాలకు వ్యాపిస్తున్న మంటలు | - | Sakshi
Sakshi News home page

పంట పొలాలకు వ్యాపిస్తున్న మంటలు

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

దుగ్గొండి : ప్రమాదవశాత్తు పంట పొలాలకు మంటలు వ్యాపిస్తున్న సంఘటన మండలంలోని నాచి నపల్లిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. గ్రా మానికి చెందిన ఓ రైతు తన మొక్కజొన్న సొప్పను తగులబెట్టాడు. ఇదే సమయంలో ఒక్కసారిగా భా రీ గాలులు రావడంతో మంటలు పక్కనే ఉన్న పంట పొలాలకు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన పరిసర రైతులంతా కలిసి ఉమ్మడిగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్‌ వేణు, హోంగార్డు ప్రభాకర్‌లు రైతులతో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించలేదు. అలాగే రేబల్లె గ్రామంలో ఓ రైతు తన పంట వ్యర్థాలను తగులబెట్టిన క్రమంలో మంటలు భారీగా వచ్చి చుట్టు పక్కలకు వ్యాపించాయి. అప్రమత్తమైన సర్పంచ్‌ జరుపుల భాస్కర్‌, పంచాయతీ కార్యదర్శి శివ గ్రామపంచాయతీ ట్యాంకర్‌ను తీసుకొచ్చి మంటలు ఆర్పివేశారు. ఈ సందర్భంగా ఎస్సై రావుల రణధీర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎవరూ పంట వ్యర్థాలను తగులబెట్టవద్దన్నారు. నేలలోనే దున్నుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్‌లలో నీరు నింపి ఉంచుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే సత్వరమే ఆర్పుకునే అవకాశం కలుగుతుందని సర్పంచ్‌లను సూచించారు.

అదుపులోకి తెచ్చిన రైతులు, పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement