హజ్రత్‌ సయ్యద్‌ జమాలే బహార్‌ బాబా ఉర్సు | - | Sakshi
Sakshi News home page

హజ్రత్‌ సయ్యద్‌ జమాలే బహార్‌ బాబా ఉర్సు

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

నర్సంపేట: పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లోని హజ్రత్‌ సయ్యద్‌ జమాలే బహార బాబా ఉర్సు నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. పట్టణంలో బుధవారం ఉత్సవాల పోస్టర్‌ను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు(గురువారం) సంధల్‌ కార్యక్రమం నిర్వహించబడుతుందని, రాత్రి 7.30గంటలకు సంధల్‌ జమా మస్జీద్‌ నర్సంపేట నుంచి ప్రారంభమై రాత్రి 11 గంటలకు దర్గా చేరుకుంటుందన్నారు. ఫాతిహా కార్యక్రమం నిర్వహించి సంధల్‌ ముగించడం జరుగుతుందన్నారు. 29న ఉర్సు కార్యక్రమం దర్గా వద్ద రాత్రి 7.30 గంటలకు ఫాతిహా ఖానీ కార్యక్రమం, 8 గంటలకు అన్నదానం, 8.30 గంటలకు బయాన్‌, 9గంటలకు ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించడం జ రుగుతుందని తెలిపారు. ఖంధిల్‌ రాత్రి 9 గంటలకు జామా మస్జిద్‌ నర్సంపేట వద్ద ప్రారంభమై 11 గంటలకు దర్గా చేరుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో దర్గా గౌరవ అధ్యక్షులు మహమ్మద్‌ అప్జల్‌, ము ర్షద్‌, హాజీపాషా, అధ్యక్షులు మహమ్మద్‌ అ హ్మద్‌, రబ్బాని, వజీర్‌, జలీల్‌, రషీద్‌, యాకుబ్‌, అ ఖిల్‌, తాజ్‌, జాహిద్‌, సమీర్‌, సోను, మీర్జా మ సూద్‌, అలీబేగ్‌, ఖాదర్‌, ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement