లైంగిక వేధింపులను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులను అరికట్టాలి

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

నర్సంపేట : మహిళలు పని చేసే చోట లైంగిక వేధింపులకు గురవుతున్నారని, వాటిని అరికట్టాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మిరామానంద్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రో జు ల యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా మహిళా శిశుసంక్షేమ శాఖ వరంగల్‌, మెపా, డీఆర్‌డీఏ నర్సంపేట ఆధ్వర్యంలో బుధవారం పోష్‌ యాక్టు–2013పై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పని చేసే చోట ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఎదుర్కొంటున్న సమస్యలు, చట్టాలు, సమస్యలపై పని చేసే కమిటీల గురించి వివరించారు. సఖి సెంటర్‌ లీగల్‌ కౌన్సిలర్‌ శోభారాణి మాట్లాడుతూ సఖి సెంటర్‌ అందిస్తున్న సేవలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, టోల్‌ ఫ్రీ నంబర్‌ 181, చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో సీడీపీఓ మధురిమ, ఏసీడీపీఓ జ్యోతి, ఏపీఎం ఝాన్సీ, మెప్మా డీఎంసీ రేణుక, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు అరుణ, పారిజాతం, కేస్‌ వర్కర్‌ తిరుమల, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీ

Advertisement
 
Advertisement
Advertisement