ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని ఈద్గా మైదానం బక్రీద్‌కు ముస్తాబైంది. గురువారం ఉదయం 9 గంటలకు జరగనున్న ఈద్–ఉల్–జుహా సామూహిక ప్రార్థనలకు సర్వం సిద్ధమైంది. మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు బల్దియా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముస్లిం, మైనార్టీ నేతలతో కలిసి ఈద్గా బక్రీద్ నిర్వహణ కమిటీ ప్రతినిధి ఎంఏ ఖలీక్ తన్వీర్ (ముతవల్లి) మైదానాన్ని బుధవారం పరిశీలించారు. ఈద్గాలో మత గురువు మౌలానా హఫీజ్‌మహ్మద్ నోమాన్ రజా ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలకు 30 వేల మంది హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట షఫీయొద్దీన్, మహిమూద్‌పాషా, సయ్యద్ మోహిజ్, శౌకత్‌అలీ, ఎండీ యూసుఫ్ ఉన్నారు.


