మహిళలకు హక్కులపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలకు హక్కులపై అవగాహన ఉండాలి

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

మహిళలకు హక్కులపై అవగాహన ఉండాలి

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రతీ సంస్థ బాధ్యత అని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రఽణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం జెడ్పీ సమావేశ హాల్‌లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టం (పోష్‌ యాక్ట్‌–2013)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, పిల్లలకు చిన్నప్పటి నుంచే లింగ సమానత్వం, పరస్పర గౌరవం నేర్పించాలన్నారు. షీ టీం ప్రతినిధి సుజాత మాట్లాడుతూ ఎక్కడైనా వేధింపులు జరిగితే 87126 85142 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీబీసీడీఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల ఆకస్మిక తనిఖీ..

ఖిలా వరంగల్‌: మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బుధవారం విద్యాశాఖ అధికారులతో కలిసి వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సందర్శించారు. డీఈఓ రంగయ్యనాయుడు, తహసీల్దార్‌ ఇక్బాల్‌, స్థానిక నాయకులు దామోదర్‌యాదవ్‌, తీగల జీవన్‌గౌడ్‌, శ్యామ్‌, శివాజీ పాల్గొన్నారు.

ధాన్యాన్ని త్వరగా తరలించాలి..

రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరగా తరలించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా వరంగల్‌ కలెక్టరేట్‌ నుంచి సత్యశారద పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement