ప్రారంభానికి ముందే పగుళ్లు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభానికి ముందే పగుళ్లు

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

ప్రారంభానికి ముందే పగుళ్లు

కమలాపూర్‌: మండలంలోని ఉప్పల్‌లో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్‌ఓబీపై ప్రారంభానికి ముందే పగుళ్లు దర్శనమిస్తున్నాయి. ఉప్పల్‌ రైల్వే గేట్‌పై నిర్మాణం పూర్తయిన ఆర్‌ఓబీపై కొద్ది నెలల క్రితం అనధికారికంగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాగా, నాసిరకం కట్టడం, బొగ్గు, గ్రానైట్‌ లారీల అధిక లోడ్‌ ప్రభావంతో ఆర్‌ఓబీపై పగుళ్లు తేలి దెబ్బతిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్‌ఓబీతో తమకు రైల్వే గేట్‌ కష్టాలు తప్పాయని, ఉప్పల్‌లో ఆర్‌ఓబీ నిర్మాణం పూర్తయితే దశాబ్దాల కల సాకారమైందని సంతోషించాలో, లేక అనతి కాలంలోనే పగుళ్లు తేలి శిథిలావస్థకు చేరుతోందని బాధపడాలో తెలియట్లేదని వాహనదారులు వాపోతున్నారు. ఆర్‌ఓబీ పైనుంచి గ్రానైట్‌, బొగ్గు లా రీలు ఓవర్‌ స్పీడ్‌, ఓవర్‌ లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీల ఓవర్‌ స్పీడ్‌, ఓవర్‌ లోడ్‌ను అరికట్టి, ఆర్‌ఓబీకి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement