● టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ రాజేందర్
నర్సంపేట: పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్థిరమైన ఆదాయం పొందవచ్చని టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్ సూచించారు. ఈ మేరకు పట్టణంలోని సిటిజన్ క్లబ్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ అధ్యక్షతన మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కుటుంబం తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని సూర్యశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకుని స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ మాట్లాడుతూ సోలార్ వ్యవస్థల వినియోగంతో విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్స్ అరుణ, పారిజాతం, కౌన్సిలర్స్ బాణాల ప్రసన్న, రజిత, నల్ల భారతి తదితరులు పాల్గొన్నారు.


