దేవాదుల కెనాల్‌ పనులపై చర్చ | - | Sakshi
Sakshi News home page

దేవాదుల కెనాల్‌ పనులపై చర్చ

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

నల్లబెల్లి: మండలంలోని గొల్లపల్లిలో దేవాదుల మె యిన్‌ కెనాల్‌కు నీటిని మళ్లించే పనులకు సంబంధించి నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి మంగళవారం రైతులతో చర్చించారు. కెనాల్‌ పనుల నిర్వహణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు తమ సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో దే వాదుల ప్రాజెక్టు కాల్వల కోసం భూములు కోల్పోయిన తమకు, ఇప్పటివరకు కొందరికి రావాల్సిన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరా రు. ఆమె వెంట తహసీల్దార్‌ ముప్పు కృష్ణ, నీటి పారుదల శాఖ డీఈ యశ్వంత్‌, ఏఈ స్టీపెన్‌, నాయకులు నారాయణ, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement