మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి

సంగెం: మహిళల ఆర్థికాభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. మహిళశక్తి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని గుంటూరుపల్లిలో అంగన్‌వాడీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కాపులకనిపర్తి, ఆశాలపల్లి, కాట్రపల్లి, వెంకటాపూర్‌, గవిచర్ల, సోమ్లాతండా, పెద్దతండా, తీగరాజుపల్లి గ్రామాల్లో నిర్మించనున్న మహిళా సమైక్య భవనాలకు కలెక్టర్‌ సత్యశారదతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఆశాలపల్లిలో ప్రేమ్‌ స్వరూప్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీఓ రవీందర్‌, పీఆర్‌డీఈ జ్ఞానేశ్వర్‌, ఏఈ అభిరామ్‌, మహిళ సమైక్య అధ్యక్షురాలు ఉమాదేవి, సర్పంచ్‌లు శ్రీకాంత్‌, చంద్రమౌళి, శ్రావణి, శ్రీనివాస్‌, సదయ్య, గోపాల్‌, వినోద, సంధ్య, మల్ల మ్మ, మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్‌, నాయకులు మాదవరెడ్డి, రమేష్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement