● కలెక్టర్ సత్యశారద
పర్వతగిరి: బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు మహిళా వారోత్సవాల్లో భాగంగా బాల్య వివాహ రహిత తెలంగాణ కార్యక్రమం మంగళవారం ఎంపీడీఓ కా ర్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో బాల్య వివా హాలు జరగకుండా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఉమా, ఎంపీడీఓ శంకర్‌నాయక్, తహసీల్దార్ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.


