బీసీ ఏ గ్రూప్‌లో ఇతర కులాలను కలపొద్దు | - | Sakshi
Sakshi News home page

బీసీ ఏ గ్రూప్‌లో ఇతర కులాలను కలపొద్దు

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

నర్సంపేట: బీసీ ఏ గ్రూప్‌లో ఇతర కులాలను కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా యత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రజక కుల ప్రతినిధి ఐలోని శ్రీనివాస్‌, నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధి సంతపూర్తి రవి తెలిపారు. బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఆచార్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ ఏ గ్రూప్‌లోని కులాలకు న్యాయం చేయకుండా ఇతర కులాలు కలపడం సరికాదన్నారు. గంగపుత్ర సంఘ ప్రతినిధి జీజుల సాగర్‌ మాట్లాడుతూ.. బీసీ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న ముదిరాజ్‌లను 7శాతం ఉన్న బీసీ ఏ లో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే విలీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేదర కుల అధ్యక్షుడు షేర్ల శ్రీనివాస్‌, తడిగొప్పుల మల్లేషం, సాంబరాజు మల్లేషం, తడిగొప్పుల రవి, రవికాంత్‌, కాపరబోయిన రమేష్‌, శ్రావణ్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement