మౌలిక సదుపాయాల కల్పనకు కృషి | - | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

టీపీసీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి

నెక్కొండ: ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి తెలిపారు. నెక్కొండ మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో డ్రెయినేజీ పనులను మంగళవారం నెక్కొండ ఏఎంసీ చైర్మన్‌ రావుల హరీశ్‌రెడ్డితో కలిసి రంజిత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలువాల స్వామి ఇంటి నుంచి ఎండీ రాజ్‌మహ్మద్‌ ఇంటి వరకు సుమారు రూ.12 లక్షలతో డ్రెయినేజీ నిర్మాణం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పెండ్యాల హరిప్రసాద్‌, ఉప సర్పంచ్‌ సింగం శ్రావణి, రామాలయ కమిటీ చైర్మన్‌ కొమ్మారెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, నాయకులు బండి శివకుమార్‌, సింగం ప్రశాంత్‌, ఈదునూరి ప్రభాకర్‌, మౌటం కష్పంరాజు, బొమ్మెరబోయిన రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement