హామీలు అమలు చేయడంలో విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీలు అమలు చేయడంలో విఫలం

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

నల్లబెల్లి: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు చింతకింది కుమారస్మా విమర్శించారు. అర్హులైన వారందరికీ తక్షణమే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్‌ అబిత్‌ అలీకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన పింఛన్లు, మహాలక్ష్మి, నిరుద్యోగ భృతి తదితర పథకాలను లబ్ధిదారులకు అందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బట్టు సాంబయ్య, నాయకులు కనకం సాల్మన్‌, పరికి కోర్నేల్‌, కోపెల శ్రీకాంత్‌, మామిండ్ల పెద్ద ఐలయ్య, సరిత, శ్రీలత, జ్యోతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement