యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

సంగెం: ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటిన తర్వాత సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని వరంగల్‌ డివిజన్‌ ఉద్యానశాఖ అధికారి ఎన్‌.తిరుపతి అన్నారు. మండలంలోని గవిచర్లలో కడ్డూరి చంద్రయ్య ఆయిల్‌పామ్‌ తోటలో పంట సాగు, యాజమాన్య పద్ధతులపై మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌ పామ్‌లో నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, ఎరువుల వాడకం క్రమం తప్పకుండా పాటించాలని తెలిపారు. ఎకరానికి ప్రతీ నెల 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 3 కిలోల పోటాష్‌, 1.25 కిలోల మెగ్నీషియం, పావుకిలో బోరాక్స్‌ డ్రిప్‌లో ఫెర్టిగేషన్‌ ద్వారా అందించాలన్నారు. ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పూర్తిగా నారింజరంగులోకి వచ్చిన తర్వాతనే గెలలు కోయాలని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ 30 నెలల వయస్సు వరకు ప్రతీ 15 రోజులకు ఒకసారి పూలగుత్తులను తొలగించాలని తెలిపారు. ఇలా తొలగించడం వల్ల చెట్టు కై వారం పెరిగి ఎక్కువ గెలలు వస్తాయని వివరించారు. ఆయిల్‌ పామ్‌ సాగు వల్ల కోతులు, అడవి పందుల బెడద ఉండదన్నారు. కార్యక్రమంలో రైతులు ఉద్యాన విస్తరణాధికారి వేణు, రైతులు గూడ సుదర్శన్‌రెడ్డి, చంద్రయ్య, దేవిసింద్‌, కూస రాజీరు, దొనికెల శ్రీనివాస్‌, గడ్డం బుచ్చయ్య తదతరులు పాల్గొన్నారు.

ఉద్యానశాఖ అధికారి తిరుపతి

Advertisement
 
Advertisement
Advertisement