రాయపర్తి: గ్రామాల్లో చేపట్టనున్న ఎమ్మార్పీఎస్ గో టు విలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఎస్పీ జాతీయ నాయకుడు వేల్పుల సూరన్నమాదిగ పిలుపునిచ్చారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన గో టూ విలేజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మే 25 నుంచి జూలై 05 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీయాలన్నారు. గ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొని చదువు మానేసిన మాదిగ విద్యార్థులకు నచ్చజెప్పి పాఠశాలలకు పంపించే ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్పీ మండల అధ్యక్షుడు వశపాక కుమార్, వశపాక మహేందర్, వశపాక విజయ్, కొమురయ్య, వశపాక జస్విత్, వశపాక సన్ని, వశపాక అన్వేష్, బరిగెల దుర్గన్న, రాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
బక్రీద్‌ను ప్రశాంతంగా
జరుపుకోవాలి
శాయంపేట : రానున్న బక్రిద్ పండుగను మండలంలోని ముస్లింలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ సుధాకర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై జక్కుల పరమేశ్‌తో కలిసి ఆయన పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బక్రిద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పరస్పర సహకారంతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. మత, వర్గ బేధాలు లేకుండా ప్రజలంతా అన్నదమ్ముళ్ల కలిసి మెలసి ఉండాలని ఆయన సూచించారు.


