బాధిత కుటుంబానికి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబానికి పరామర్శ

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

నర్సంపేట: నర్సంపేట పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ మామ గుండం రాజేందర్‌ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌ నాయకులతో కలిసి వెళ్లి రాజేందర్‌ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గంధం నరేందర్‌గుప్తా, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ ఎర్ర యాకుబ్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు బీరం భరత్‌రెడ్డి, భూక్య మాతృరాథోడ్‌, ఎలకంటి విజయ్‌, పొన్నాల మనీషప్రకాశ్‌ పాల్గొన్నారు.

వర్ధన్నపేట: పట్టణ కేంద్రంలోని 8వ వార్డుకు ఆడెపు సోమక్క(100) మృతిచెందింది. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చైర్మన్‌తోపాటు 12వ వార్డు కౌన్సిలర్‌ తిరుపెల్లి వాణి కుమారస్వామి, నాయకులు బచ్చు గంగాధర్‌రావు, పూజారి శ్రీనివాస్‌, తిరుపతి సారయ్య, మార్త సారంగపాణి, బక్కతట్ల రాజు, ఆడెపు ప్రకాశ్‌, చిదురాల కేదారి, కోల అశోక్‌, మహేష్‌ తదితరులు సోమక్క మృతదేహం వద్ద నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement