ధాన్యం బస్తాలకు దుండగుల నిప్పు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం బస్తాలకు దుండగుల నిప్పు

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

ధాన్యం బస్తాలకు దుండగుల నిప్పు

కొప్పుల గ్రామంలో ఘటన

శాయంపేట: మండలంలోని కొప్పుల గ్రామ శివారులో ధాన్యం బస్తాలకు దుండగులు నిప్పు పెట్టిన సంఘటన మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. కొప్పుల గ్రామానికి చెందిన గండి హనుమంతు గ్రామ శివారులోని 3 ఎకరాల్లో వరిపంట సాగుచేయగా 110 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ట్రాక్టర్‌ కోసం రైతు వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు డంపింగ్‌ యార్డుకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాప్తించి 110 వడ్ల బస్తాలు, పైపులు మోటార్లు కాలిపోయాయి. తమకు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని హనుమంతు కోరాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై జక్కుల పరమేశ్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement