డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కల్పించాలి

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కల్పించాలి జూన్‌ 17న ప్రాంతీయ డాక్‌ అదాలత్‌ దరఖాస్తుల ఆహ్వానం రెవెన్యూ శాఖలో బదిలీలు 24 మంది గైర్హాజరు

హన్మకొండ అర్బన్‌: డ్రగ్స్‌ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్‌ సూచించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో డ్రగ్స్‌ నిర్మూలనపై వివిధ శాఖల అధికా రులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. అనంతరం డీఆర్‌ఓ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మత్తు పదార్థాలపై కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధార కవిత మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల స్థాయిలో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రమేశ్‌ రాథోడ్‌, వెంకన్న, జిల్లా శిశు సంక్షేమ అధికారి విశ్వజ, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, హనుమకొండ, కాజీపేట, పరకాల ఏసీపీలు నరసింహారావు, ప్రశాంత్‌రెడ్డి, సతీశ్‌బాబు, అదనపు డీఎంహెచ్‌ఓ మదన్మోహన్‌ పాల్గొన్నారు.

ఖిలా వరంగల్‌: పోస్టల్‌ సర్వీసుల ఫిర్యాదుల పరిష్కారం కోసం జూన్‌ 17న ప్రాంతీయ డాక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు తపాలాశాఖ వరంగల్‌ డివిజన్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు గూగుల్‌ మీట్‌ ద్వారా నిర్వహించుచున్నట్లు ఆయన పేర్కొన్నారు. హనుకొండ, మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌ జిల్లాల పరిధిలోని వరంగల్‌ డివిజన్‌కు సంబంధించి తపాలా సేవల వినియోగదారులు తమ ఫిర్యాదులను పోస్టల్‌ ఎనవలప్‌/కవర్‌పై 54వ ప్రాంతీయ డాక్‌ అదాలత్‌, కె.శ్రీకాంత్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ (స్టాఫ్‌ అండ్‌ విజిలెన్స్‌), పోస్టుమాస్టర్‌ జనరల్‌ హైదరాబాద్‌ రీజియన్‌–500001 చిరునామా రాసి వచ్చే నెల ఐదో తేదీలోగా చేరేటట్లు పంపించాలని ఆయన కోరారు.

హసన్‌పర్తి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని హసన్‌పర్తి, వేలేరు, వంగర, కొడకండ్ల బండారుపల్లి గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖా ళీగా ఉన్న వివిధ సబ్జెక్టులు బో ధించేందుకు అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ కన్వీనర్‌ రామారావు తెలిపారు. పాఠశాలల్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, సంస్కృతం, ఫిజికల్‌ సైన్స్‌, బయాలజీ, సోషల్‌ బోధించేందుకు ఉపాధ్యాయులు, ఇంటర్‌లో మ్యాఽథ్స్‌, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌ బోధించేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు సమీపంలోని గురుకుల విద్యాల యం, హసన్‌పర్తిలోని తెలంగాణ బాలికల వి ద్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. జూన్‌ 3న ఎర్రగట్టుగుట్ట సమీ పంలోని తెలంగాణ బాలిక పాఠశాల, కళాశాలలో డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు.

హన్మకొండ అర్బన్‌: రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టారు. హనుమకొండ అదనపు కలెక్టర్‌ రవి, డీఆర్వో శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏఓ గౌరీశంకర్‌ ఆధ్వర్యంలో మంగళవారం బదిలీల ప్రక్రియ నిర్వహించారు. హనుమకొండ జిల్లాలోని నలుగురు నాయబ్‌ తహసీల్దార్లు, 13 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు టైపిస్టులు, 12 మంది ఆఫీస్‌ సబార్డినేట్లకు స్థానచలనం కల్పించారు. వీరందరికీ బుధవారం బదిలీ ఉత్తర్వులు అందజేయనున్నారు.

కాళోజీ సెంటర్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్‌కు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్‌ పేపర్‌లో 24 మంది గైర్హాజరు అయినట్లు వరంగల్‌ డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ కోర్సులో 78 మంది విద్యార్థులకు 19 మంది గైర్హాజరు అయినట్లు పేర్కొ న్నారు. ద్వితీయ సంవత్సరంలో 39 మందికి ఐదుగురు గైర్హాజరు అయినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement