వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
హసన్‌పర్తి: బక్రీద్ పండుగ వేళ ప్రార్థనా స్థలాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని వరంగల్ పోలీస్‌కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశించారు. బక్రీద్‌ను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో మంగళవారం సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ ప్రశాంతంగా నిర్వహించడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గోవుల పరిరక్షణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సంతల్లో మూగజీవాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గతంలో మత ఘర్షణలో పాల్గొన్న పాతనేరస్తులను బైండోవర్ చేయడంతో పాటు సోషల్‌మీడియాపై ప్రత్యేక నజర్ పెట్టాలన్నారు.
రైతులు నష్టపోకుండా చూడాలి..
రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. ధాన్యం సేకరణ కేంద్రాల పనితీరుపై మంగళవారం సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీసీపీలు అంకిత్‌కుమార్, దార కవిత, ఏసీపీలు జీతేందర్‌రెడ్డి, జానీ నర్సింహులు, డేవిడ్‌రాజు, ఇన్‌స్పెక్టర్లు, సంజీవ, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు నాకాబందీ
నేరాల నియంత్రణకు నాకాబందీ నిర్వహించిన్నట్లు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నాకాబందీ నిర్వహించి మాట్లాడారు. మొత్తం 11,286 వాహనాలు తనిఖీ చేసి, వివిధ కారణాలతో 275 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. 197 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు చెప్పారు. శాయంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, దామెర పోలీస్ స్టేషన్‌పరిధిలో మద్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇంతేజార్ గంజ్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.


