నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని విజ్‌డమ్ హైస్కూల్ విద్యార్థిని ఏ.చందన సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికై నట్లు జిల్లా బేస్ బాల్ కార్యదర్శి అర్జున్ తెలిపారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో ఈనెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. పాఠశాల డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ.. చందన జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొనడం గర్వకారణం అన్నారు. ఈసందర్భంగా చందన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని పోలీస్ అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం తన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా చందన, కోచ్ అన్వేష్‌ను పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాశ్, అకాడమిక్ అడ్వైజర్ నాజియా ఇక్బాల్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు ప్రశాంత్‌కుమార్, రియాజ్, రాజేష్, మధు, పృథ్వి అభినందించారు.


