వర్ధన్నపేట: మున్సిపాలిటీ పరిధి లోని రెండో వార్డులో గత నాలుగు నెలలుగా నీటి సరఫరా లేక ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. దీంతో ప్రజల విన్నపం మేర కు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు బానోతు జ్యోతి నవీన్, గుజ్జ వీరన్న, సిలువేరు కుమారస్వామి, తిరుపతి, సురేష్ వెంటనే స్పందించారు. సంబంధిత మున్సిపల్ ఏఈతో మాట్లాడి సమన్వయంతో వాటర్ ట్యాంక్ వద్ద పాడైన గేట్ వాల్వ్ మార్పించడంతోపాటు ఇతర సాంకేతిక లోపాలను సరిచేయించారు. దీంతో ఆదివారం నీటి సమస్యను పరిష్కారమైంది. కార్యక్రమంలో తుమ్మల శ్రీధర్, సింగరబోయిన రాజశేఖర్, వార్డు ప్రజలు పాల్గొని అధికారులు, కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు.


