ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

May 25 2026 9:51 AM | Updated on May 25 2026 9:51 AM

దుగ్గొండి: మండలంలోని మైసంపల్లి గ్రామంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్‌ వేముల ఇంద్రదేవ్‌ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతులు తాము పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించుకుని నష్ట పోకుండా ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ఆనందం, ప్రతిభ గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు రజిత, వీఓఏ నరిగె బాబు, వార్డు సభ్యులు ఇటుకాల రవి, విజయలత, రైతులు ఈర కుమారస్వామి, జంపయ్య, మహేందర్‌, మోహన్‌, వేణు, రమేష్‌, సారయ్య, శ్రీను, కృష్ణాకర్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ

పనులు ప్రారంభం

గీసుకొండ : మండలంలోని రాంపూర్‌లో గ్రామ పంచాయతీ నిధులు రూ.6 లక్షలతో చేపట్టిన 140 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం పనులు సర్పంచ్‌ రడం భరత్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పులి సూరయ్య, మాజీ సర్పంచ్‌ గాజర్ల గోపి, మాజీ ఉపసర్పంచ్‌ దర్శనాల కుమారస్వామి, గుడి చైర్మన్‌ తాబేటి వెంకటేశ్వర్లు, గజ్జి రవి, మర్రెరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

నియామకం

వర్ధన్నపేట: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) హనుమకొండ జిల్లా కన్వీనర్‌గా మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన బెల్లం కార్తీక్‌ నియమితులయ్యారు. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన ఏబీవీపీ తెలంగాణ ప్రాంత అభ్యాస వర్గాలో రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ.. కార్తీక్‌ నియామకాన్ని ప్రకటించారు. కార్తీక్‌ గతంలో వరంగల్‌ మహానగర సంయుక్త కార్యదర్శిగా, వరంగల్‌ విభాగ్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌గా, రెండు సార్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, వరంగల్‌ మహానగర కార్యదర్శిగా పనిచేశారు.

గడ్డి వాము దగ్ధం

దుగ్గొండి: ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి వరిగడ్డి వాము అంటుకున్న ఘటన మండలంలోని కేశవాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రా మానికి చెందిన దుర్గునాల సురేష్‌కు చెందిన వరిగడ్డి వాముపైనుంచి ఉన్న విద్యుత్‌ తీగలు గాలిదూమారానికి ఒకదానికొకటి తగిలి మిరుగులు లేచి గడ్డిపై పడ్డాయి. దీంతో గడ్డివాము అంటుకుంది. మంటలు పక్కనే ఇళ్లకు అంటుకోకుండా గ్రామ యువకులు గ్రామపంచాయ తీ ట్యాంకర్‌ సాయంతో మంటలు ఆర్పి వేశా రు. దీంతో పెనుప్రమాదం తప్పింది. కార్యక్రమంలో సర్పంచ్‌ బాదరగాని రమరమేష్‌, గ్రా మ యువకులు దిలీప్‌, ప్రశాంత్‌, సురేష్‌, సందీప్‌, కరుణాకర్‌, నరేష్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

పరిశోధనలను వెలుగులోకి తీసుకురావాలి

హన్మకొండ కల్చరల్‌: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో గత మూడు దశాబ్దాలుగా సేకరించిన పరిశోధనలను పుస్తకరూపంలో ముద్రించి వెలుగులోకి తీసుకురావాలని తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ అన్నా రు. ఇటీవల అకాడమీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనను హనుమకొండ బాలసముద్రంలోని స్వగృహంలో వరంగల్‌ జానప ద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్‌ గడ్డం వెంకన్న ఆధ్వర్యంలో పీఠం అధ్యాపకులు, సిబ్బంది ఆదివారం మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ ఇంటర్‌, డిగ్రీ, ఇతర పోటీ పరీక్షల కోసం విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నాణ్యమైన పుస్తకాలను అకాడమీ ముద్రిస్తుందని చెప్పారు. కేయూ దూరవిద్య కేంద్రం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కొట్టె భాస్కర్‌, పీఠం అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement