పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

May 25 2026 9:51 AM | Updated on May 25 2026 9:51 AM

దుగ్గొండి: మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002–03 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 23 సంవత్సరాల అనంతరం మళ్లీ కలుసుకోవడంతో ఒకరినొకరు ఆనందంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాటి గురువులు సోమదాసు, రమేష్‌బాబు, రాములు, రవీందర్‌, రమాదేవి, దేవకర్ణను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నాగరబోయిన రాజుకుమార్‌, స్వామి, ప్రశాంత్‌, వినయ్‌, రాజు, జే.స్వామి, బి.ఐలయ్య, అక్కెల్లి ప్రవీణ్‌, నల్ల రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

లక్నెపల్లిలో..

నర్సంపేట రూరల్‌ : నర్సంపేట మండలంలోని లక్నెపల్లి జిల్లా పరిషత్‌ సెంకడరీ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 2008–09 పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఖలీల్‌పాష, బాలకృష్ణ, రామకృష్ణ, సంతోష్‌, రాజ్‌కుమార్‌, ప్రవీణ్‌, లింగయ్య, నవీన్‌, కుమారస్వామి, ప్రశాంత్‌, ప్రసాద్‌, రాజేశ్వర్‌, అనిల్‌, మహేష్‌, కిరణ్‌, కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండ: మండల కేంద్రంలో హైస్కూల్‌లో హెడ్‌మాస్టర్‌ శ్రీదేవి అధ్యక్షతన 2010–2011 పదోతరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. స్నేహితులతో ఆటపాటలతో సందడి చేశారు. విద్యాబుద్దులు నేర్పిన గురువుల సేవలను స్మరించుకుంటూ...వారి మార్గదర్శకత్వం ఎంతగానో దోహదపడిందని వారు పేర్కొన్నారు. నాటి గురువులైన మెట్టు నర్సింహరెడ్డి, బుర్ర రవీందర్‌, బూరుగుపల్లి శ్రవణ్‌కుమార్‌, తంగళ్లపల్లి రవీంద్రనాథ్‌, రవీందర్‌రెడ్డి, పి.సాంబయ్య, ఎండీ.నజీరుద్దీన్‌, బి.బాలశివారెడ్డి, పూర్వ విద్యార్థులు ఈదునూరి మహేష్‌, రామారపు శిరీష, నగేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement