చెన్నారావుపేట: మండల కేంద్రంలోని కోపాకుల చెరువులో నల్లమట్టిని కొంతమంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. వ్యవసాయ అవసరాల పేరిట నీటి పారుదల శాఖ నుంచి అనుమతులు తీసుకుని ఇటుకబట్టీలకు మట్టిని తరలిస్తున్నా రు. మట్టితరలింపును అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పో లీసు, ఐబీ అధికారులు ప్రజల ఫిర్యాదులను పట్టించుకోవడంలేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో చెన్నారావుపేట గ్రామస్తులే అర్ధరాత్రి వరకు రోడ్లపైకి వచ్చి మట్టితరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు.
అసలేం జరిగింది..!
చెన్నారావుపేట మండల పరిధిలోని చెన్నారావుపేట, కోనాపురం, అక్కల్‌చెడ, జోజిపేట, ఖాదర్‌పే ట, పాతమగ్దుంపురం, గొల్లపల్లి తదితర గ్రామాల రైతులకు కోపాకుల చెరువువే ఆధారం. ఈ చెరువు నీటితోనే వ్యవసాయం చేస్తారు. అలాంటి చెరువు మట్టిపై కొంతమంది కన్నేశారు. నర్సంపేటకు చెందిన అధికార పార్టీ నాయకుడు ఓర్సు తిరుపతి అధికారుల అండతో వ్యవసాయ పేరుతో కోసమని 250 క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపునకు ఐబీ అధి కారుల నుంచి అనుమతి తీసుకున్నాడు. ఆ అనుమతి సాకుతో శనివారం మధ్యాహ్నం కోపాకుల చెరువుతో జేసీబీలు, ఇటాచీలు, టిప్పర్లతో మట్టి తరలింపు ప్రారంభించాడు. అనుమానం వచ్చిన గ్రామస్తులు విషయం తెలుసుకుని రెవెన్యూ, పోలీ సు అధికారులకు ఎన్నిసార్లు ఫోన్‌లు చేసినా స్పందన రాలేదు. దీంతో 100 డయల్ చేశారు. ఐనప్పటికీ అధికారులు రాకపోవడంతో గ్రామస్తులే మట్టితరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ తతంగం మొత్తం దాదాపు తెల్లవారుజాము 2 గంటల వరకు సాగింది. గ్రామస్తులు ఇళ్లకు వెళ్లిన వెంటనే మళ్లీ మ ట్టి తరలింపు ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే మాధవరెడ్డికి ఫోన్ చేస్తే కానీ అధికారులు రంగంలోకి దిగని తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కోపాకుల చెరువు కింద అధికారికంగా 500 ఎకరాలు, అనధికారికంగా మరో 300 ఎకరాలు సాగు అవుతుంది.
అర్ధరాత్రి వరకు నడుస్తున్న టిప్పర్లు
అడ్డుకున్న గ్రామస్తులు


