బాధిత కుటుంబానికి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబానికి పరామర్శ

May 25 2026 9:51 AM | Updated on May 25 2026 9:51 AM

నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ పట్టణ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్‌ నానమ్మ బిట్ల వెంకటమ్మ ఆదివారం మృతి చెందారు. ఈ సందర్భంగా వెంకటమ్మ మృతదేహంపై టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్‌ పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్‌కుమార్‌, బీరం భరత్‌రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్‌, లక్కార్స్‌ రమేష్‌, మాజీ కౌన్సిలర్‌ దేవోజు తిరుమలసదానందం, చిప్ప నాగ, నాయకులు కోల చరణ్‌గౌడ్‌, శంకరబత్తుల శివ, గొర్రె నవీన్‌, వేల్పుల కృష్ణ, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు దేవోజు హేమంత్‌, శ్రీను పాల్గొన్నారు.

రాయపర్తి: ఇటీవల మృతిచెందిన మండలంలోని కొత్తరాయపర్తికి చెందిన గారె వెంకన్న కుటుంబ సభ్యులను ఎస్‌ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు, మాజీ సర్పంచ్‌ గారె నర్సయ్య ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి చేకూర్చిన బియ్యంతోపాటు ఆయిల్‌క్యాన్‌ను బాధిత కుటుంబానికి అందించినట్లు నర్సయ్య తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు గారె కల్యాణివిష్ణు, గారె యాకూబ్‌, నాయకులు గారె భిక్షపతి, గారె ఎల్లయ్య, గారె మల్లయ్య, గారె వెంకన్న, గారె బాబు, గారె కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement