మొరం దోపిడీని నియంత్రించాలి | - | Sakshi
Sakshi News home page

మొరం దోపిడీని నియంత్రించాలి

May 25 2026 9:51 AM | Updated on May 25 2026 9:51 AM

కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు

చరణ్‌ సింగ్‌

నల్లబెల్లి: ఏజెన్సీ ప్రాంతంలోని రంగయ్యచెరువులో బీఆర్‌ఎస్‌ నాయకుల మొరం దోపిడీని అధికారులు నియంత్రించాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్‌ చరణ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం పార్టీ నాయకులు ఎర్రబెల్లి రఘుపతిరావు, మాలోత్‌ మోహన్‌తో కలిసి రంగయ్య చెరువులో చేపడుతున్న మొరం తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట అటవీ శాఖ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ, అడ్డుకోవాల్సిన నర్సంపేట ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రవి కిరణ్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మామూళ్లకు అలవాటుపడిన సదరు అధికారి కనుసన్నల్లోనే ఈ మొరం దోపిడీ సాగుతోందని విమర్శించారు. కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి పర్యావరణాన్ని గుల్ల చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారని అన్నారు. అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహరంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందిస్తూ సమగ్ర విచారణ జరపాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement