ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేయాలి

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

కాశిబుగ్గ: ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను అధికారులు చేరుకోవాలని వరంగల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సాంబశివరావు సూచించారు. వైద్యరంగంలో వరంగల్‌ జిల్లాను అన్ని విభాగాల్లో ముందుంచాలని, ప్రత్యేకంగా టీబీ ముక్త్‌ అభియాన్‌ కార్యక్రమం కింద క్షేత్రస్థాయిలో ఎక్స్‌రే క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. వరంగల్‌ ఐఎంఏ హాల్‌లో వైద్యాధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన మాతా, శిశు ఆరోగ్య కార్యక్రమం కింద క్షేత్రస్థాయిలో గర్భిణులను గుర్తించి నమోదు చేయాలని, జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ప్రకాశ్‌, డాక్టర్‌ ఇక్తాదర్‌ అహ్మద్‌, డాక్టర్‌ అరుణ్‌ జోషి, డాక్టర్‌ విజయ్‌కుమార్‌, జిల్లా మలేరియా విభాగం అధికారి రజిని, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సాంబశివరావు

Advertisement
 
Advertisement
Advertisement