ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం

సంగెం : ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న మండలంలోని గుంటూరుపల్లి ఉపసర్పంచ్‌ దండా నరేశ్‌ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హనుమకొండలోని తన నివాసంలో శనివారం శాలువా కప్పి సన్మానించారు. తొలుత ఎమ్మెల్యేను నరేశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేశ్‌ను ఎమ్మెల్యే అభినందించాఉ. ప్రజాసమస్యలకే పరిమితం కాకుండా ఉపసర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఇండ్ల రవికుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి నాయకులు మాధవరెడ్డి, హరిబాబు, కేశవులు, సంపత్‌, సదయ్య, రమేశ్‌, సర్పంచ్‌ బాషిపాక సదయ్య, ఉపసర్పంచ్‌లు ఆగపాటి రాజు, సోలగుడి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కార్యదర్శికి..

రాయపర్తి : మండలంలోని మహబూబ్‌నగర్‌ ఉపసర్పంచ్‌ చెన్నబోయిన రవి ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆయన్ను నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement