కాశిబుగ్గ : వరంగల్ కాశిబుగ్గలోని రంగనాథ స్వామి ఆలయంలో కొలువైన ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. శనివారం సప్తమి కావడంతో నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన చైర్మన్ గోషికొండ శకుంతల సుధాకర్, ధర్మకర్తలు నీలం అరుణ శ్రీనివాస్, పల్లకొండ రాజమణి రమేష్, మెడికుర్తి లోకేష్, పిట్టల కోటేశ్వర్, అలయ ప్రధాన అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచార్యులు అభిషేకాలు, పూజలు చేయించారు. లక్కిరెడ్డి పూర్ణేందర్‌రెడ్డి, సీతారామాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ దాసరి రాజేష్‌లు శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.


