ఉత్సవాలకు తోడ్పాటు | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలకు తోడ్పాటు

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

రాయపర్తి : మండలంలోని జేతురాంతండాలో దుర్గమ్మ ఉత్సవాల నిర్వహణకు ఎస్‌ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి చేయూత అందించారు. ఆయన పంపించిన రూ.10 వేల నగదును నిర్వాహకులకు ఫౌండేషన్‌ ప్రతినిధులను శనివారం అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు, నాయకులు యూసుఫ్‌, నేతావత్‌ మన్సూర్‌, నేతావత్‌ శ్రీధర్‌, గుగులోతు బోజ్యానాయక్‌, వార్డు మెంబర్లు గుగులోతు బద్రి, నేతావత్‌ రమేశ్‌, మోతీలాల్‌, శ్రీనివాస్‌, రాజు, యాకూబ్‌, గుడి పూజారి సూక్య తదితరులు పాల్గొన్నారు.

నివాళి

పర్వతగిరి : మండల కేంద్రానికి చెందిన గుడ్ల యాకాంబ్రం శనివారం అనారోగ్యంతో మృతి చెందగా అతడి మృతదేహానికి అతడి 1988–89 బ్యాచ్‌ పదో తరగతి స్నేహితులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి యాకాంబ్రం స్నేహితులు రంగు జనార్ధన్‌ ఆధ్వర్యంలో రూ.7,500 సాయం అందజేశారు. కార్యక్రమంలో యాకాంబ్రం స్నేహితులు బరిగల వెంకటేశ్వర్లు, బాసాని సత్యం, చీదురు తిరుపతి, గుడ్ల శ్రీధర్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగురాలికి..

ఖానాపురం : మండలంలోని మనుబోతులగడ్డకు చెందిన దివ్యాంగురాలు ఐలమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె మృతదేహానికి ఏపీజే అబ్దుల్‌ కలాం దివ్యాంగుల అసోసియేషన్‌ ప్రతినిధులు నివాళు లర్పించారు. అనంతరం పరామర్శించి రూ.6 వేల సాయం అందజేశారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు ఏశబోయిన కుమార్‌, గాడుదుల జగ్గయ్య, యాకూబ్‌, ముత్తిలింగం, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

గీసుకొండ : మండలంలోని శాయంపేట హవేలీలో బీఆర్‌ఎస్‌ నాయకుడు, మండల పరిషత్‌ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు అక్తర్‌ పాషా తండ్రి యాకూబ్‌ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం పరామర్శించారు. తొలుత యాకూబ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మచ్చాపూర్‌ సర్పంచ్‌ బోడకుంట్ల ప్రకాశ్‌, నాయకులు ముంత రాజయ్య, గుర్రం రఘు, నిమ్మగడ్డ వెంకన్న, సిరిసె శ్రీకాంత్‌, మాజీ సర్పంచ్‌ చంద్రమౌళి, అజర్‌ మున్నా తదితరులు పాల్గొన్నారు.

మండలంలో పలువురికి..

సంగెం : మండలంలోని కాట్రపల్లికి చెందిన గాయపు నారాయణరెడ్డి, అనుముల నర్సమ్మ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. అనంతరం కాట్రపల్లి, నల్లబెల్లి గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు మేకల దూడయ్య, గుగులోత్‌ రెడ్యా నాయక్‌ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, నాయకులు గూడ సుదర్శన్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, బాలకృష్ణ, మేరుగు వీరేశం, కొనకటి మొగిలి తదితరులు పాల్గొన్నారు.

ధర్మకర్త కుటుంబానికి..

గీసుకొండ : మండలంలోని కొమ్మాల లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్‌ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ గంగు ఉపేంద్రశర్మ, మాజీ ఈఓ కమలాదేవి శనివారం పరామర్శించారు. తొలుత శ్రీనివాసాచార్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాసా చార్యులు కుమారులు వెంకటాచార్యులు, దామోదరాచార్యులు, కోడలు అనురాధ, భార్య పద్మావతిలను ఓదార్చారు.

శివరామపురంలో..

రాయపర్తి : మండలంలోని శివరామపురం గ్రామానికి చెందిన నాగపురి ఐలమ్మ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని సర్పంచ్‌ శీల హేమలత రత్నాకర్‌రెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి బియ్యం సాయంగా అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ భూక్య లచ్చునాయక్‌, వార్డు మెంబర్‌ చెడుపాక భరత్‌కుమార్‌, కాంగ్రెస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాయితోజు ఉపేంద్రాచారి, ప్రధాన కార్యదర్శులు నాగపురి శ్రీని వాస్‌, చెడుపాక యాకయ్య, నాయకులు పెందోట వెంకటేశ్వర్లు, నాగపురి భిక్షపతి, పసునూరి ప్రభాకర్‌రెడ్డి, నాగపురి యాకయ్య, రాజి రెడ్డి, నాగపురి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement