ఉచిత వైద్యశిబిరం | - | Sakshi
Sakshi News home page

ఉచిత వైద్యశిబిరం

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

గీసుకొండ : గ్రేటర్‌ వరంగల్‌ పరిధి 15వ డివిజన్‌లోని గొర్రెకుంటలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఆరోగ్య ఉపకేంద్రం వద్ద శనివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. పలువురికి చెస్ట్‌ ఎక్స్‌రే, బీపీ, షుగర్‌ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు శౌర్య శరణ్య, నేహ, ఏఎన్‌ఎంలు శంకుతల, భవానీ, మాధవి, హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ కిరణ్‌కుమార్‌, ఆపరేటర్‌ రంజిత్‌, ఎల్‌టీ కల్పన, కాంగ్రెస్‌ నాయకుడు ఎలగొండ ప్రవీణ్‌, ఆశ కార్యకర్తలు ఇసంపెల్లి వజ్ర, ల్యాదల్ల నిర్మల, కొట్టె అపరంజి, బందెల రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

లారీలు ఢీ.. డ్రైవర్లకు గాయాలు

రాయపర్తి : రెండు లారీలు ఒకదాన్ని మరొకటి ఢీకొనగా వాటిని నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయలయ్యాయి. ఈ ఘటన రాయపర్తి శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల సమీపంలోని ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వరంగల్‌ దిశగా వెళ్తున్న రెండు లారీలు ఒకదానికి మరొకటి తగలడంతో డ్రైవర్లకు గాయాలయ్యాయి. అతివేగం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు వ్యాఖ్యానించారు.

నేడు స్కాలర్‌షిప్‌ పరీక్ష

నర్సంపేట : పట్టణంలోని గీతాంజలి డీజీ పాఠశాలలో నేడు (ఆదివారం) ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు పొందే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ పరీక్ష నిర్వహిస్తామని గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ వేములపల్లి సుబ్బారావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా స్కాలర్‌షిప్‌ పరీక్ష నిర్వహించి ప్రతిభ చాటిన మొదటి ఐదుగురు విద్యార్థులకు ఫీజులో 50, 30, 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రతిభావంతులకు వెంటనే రాయితీ ప్రకటిస్తామన్నారు.

రైలు నుంచి పడి వ్యక్తి మృతి

ఖిలా వరంగల్‌ : ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్‌–చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య శనివారం చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీలోని చీరాల నుంచి మంచిర్యాల వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్‌పై మృతి చెందాడు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్టు తెలిపారు. సమాచారం తెలిస్తే 9849749220, 8712658627 నంబర్లకు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

వృద్ధురాలి ఆత్మహత్య

వరంగల్‌ కరీమాబాద్‌కు చెందిన దొనికెల కమలమ్మ (71) తన కుమారుడికి భారం కావొద్దనే ఉద్ధేశ్యంతో వరంగల్‌–కాజీపేట రైల్వేస్టేషన్ల నడుమ ౖరైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ సుదర్శన్‌ వివరాలు వెల్లడించారు. కమలమ్మ మృతదేహానికి ఎంజీఎం మార్చురీలో శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె కుమారుడు రాజుకు అప్పగించినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement