దుగ్గొండి : మండలంలోని దుగ్గొండి, మైసంపల్లి గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు కామిశెట్టి ప్రశాంత్, వేముల ఇంద్రదేవ్ శనివారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉపశమనం కలిగించేలా మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నట్టు తెలిపారు. కూలీలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌లు బొంపెల్లి ఆనందం, పల్లె వైష్ణవి శ్యామ్, ఫీల్డ్ అసిస్టెంట్లు జన్ను నర్సయ్య, కవిత, తదితరులు పాల్గొన్నారు.
అంగడిలో ‘ఏబీఆర్’ ఆధ్వర్యంలో..
గీసుకొండ : మండలంలోని కొమ్మాల అంగడిలో కాంగ్రెస్ నాయకుడు, సామాజిక సేవకుడు అల్లం బాలకిశోర్‌రెడ్డి, స్వప్నదేవి (ఏబీఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులు, వ్యాపారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని సర్పంచ్ వీరగోని రాజ్‌కుమార్, జిల్లా నాయకుడు అల్లం మర్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో కొమ్మాల, దస్రుతండా సర్పంచ్‌లు కన్నెబోయిన యమున ప్రవీణ్, కేతోతు అమృత భిక్షపతి, నాయకులు స్వామి, మాదాసి రాంబాబు, పొగాకు భిక్షపతి, ఓదెల సురేశ్, పాకనాటి మధు, వాంకుడోతు తిరుపతి, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


