ఆధునిక జీవనశైలిలో నడక తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఆధునిక జీవనశైలిలో నడక తప్పనిసరి

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

ఆధునిక జీవనశైలిలో నడక తప్పనిసరి

సంగెం : ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణకు నడక తప్పనిసరి అని ఇంటరేషనల్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ గవర్నర్‌ డాక్టర్‌ పుల్లూరి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. మండల కేంద్రంలో కొత్తగా ఏర్పడిన వాకర్స్‌ అసోసియేషన్‌కు సలహాదారు దశరథ్‌రామ్‌రెడ్డితో కలిసి శనివారం రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేసి కమిటీని ప్రకటించారు. ప్రెసిడెంట్‌గా బిట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా గుండేటి కుమారస్వామి, ట్రెజరర్‌గా పులి వీరస్వామి, జిల్లా వాకర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్లు పేర్ల రమేష్‌, గుండేటి బాబు, ఇప్పకాయల మనోహర్‌, ఎలుకుర్తి బుచ్చిరెడ్డిలను నియమించి నియామక పత్రాలు అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడారు. అసోసియేషన్‌ సభ్యులందరూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా అరగంటపాటు నడక సాగించాలని, వ్యాయామం చేయాలని, ఇతరులను చైతన్యవంతం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయాలని సూచించారు. నడకతో శారీరక వికాసానికి బాటలు పడతాయని చెప్పారు. ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మెట్టుపల్లి కుమారస్వామి, విజయ ప్రకాశ్‌, గురుమూర్తి, రామకృష్ణ, రాజు, సత్యదేవ్‌, మహేందర్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement