యువత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

యువత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

యువత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి

వరంగల్‌ స్పోర్ట్స్‌: యువత సంక్షేమం, అభివృద్ధే తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువజన, క్రీడల వారోత్సవాలు శనివారం ముగిశాయి. హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోని రెజ్లింగ్‌ హాల్‌లో నిర్వహించిన ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉద్యోగ సాధన – కనెక్టింగ్‌ టాలెంట్‌ విత్‌ అపార్చునిటీస్‌’ కార్యక్రమంలో విజేతలకు పతకాలను అందజేశారు. అదేవిధంగా ఇటీవల నిర్వహించిన జాబ్‌మేళాలో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కుడా చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఒలింపిక్స్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్‌ఖాన్‌, తెలుగు అకాడమీ చైర్మన్‌ వెంకట నారాయణ, పరిశ్రమల శాఖ జీఎం నవీన్‌ కుమార్‌, డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement