కమలాపూర్‌లో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కమలాపూర్‌లో అగ్నిప్రమాదం

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

కమలాపూర్‌లో అగ్నిప్రమాదం

వెయ్యి తాటి చెట్లు దగ్ధం : ఆదుకోవాలని గీతకార్మికుల విజ్ఞప్తి

కమలాపూర్‌: మండల కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు వెయ్యి తాటి చెట్లు దగ్ధమయ్యాయి. శుక్రవారం కన్నూరు శివారు నుంచి చెలరేగిన మంటలు పంట పొలాల మీదుగా కమలాపూర్‌ తాటి వనం వైపు వ్యాపించి 200 తాటి చెట్లు దగ్ధమయ్యాయి. శనివారం పెద్దమ్మ దేవాలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పంట వ్యర్థాలకు నిప్పంటించడంతో మరోసారి మంటలు చెలరేగాయి. ఆ మంటలు తాటి వనంపై వైపు వ్యాపించి సుమారు వెయ్యి తాటిచెట్లు అగ్నికి ఆహుతి అయ్యా యి. కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పివేశారు. కల్లు పారే చెట్లు సుమారు వంద వరకు ఉన్నాయని, తాటి చెట్లు దగ్ధమవడంతో తాము జీవనోపాధి కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని గీత కార్మికులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement