వరంగల్ విద్యార్థికి స్టేట్ ఫస్ట్‌ర్యాంకు
ఖిలా వరంగల్: పాలిసెట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ రుద్రమదేవి కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ నామాల రాజు–రజిత దంపతుల కుమారుడు లోకేశ్ ఎంపీసీ విభాగంలో 120/120 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఎంబైపీసీలో 120 మార్కులకు 90 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు శనివారం గోల్డెన్ ఓక్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థి లోకేశ్‌ను ఆ స్కూల్ చైర్మన్ గంట రవికుమార్ శాలువా కప్పి శనివారం అభినందించారు.
అన్నాదమ్ములకు ర్యాంకులు
నర్సంపేట/మహబూబాబాద్ అర్బన్: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్ ఫర్మాన్‌షా ఎంబైపీసీలో రాష్ట్రస్థాయిలో 120 మార్కులకు 119 మార్కులతో నాలుగో ర్యాంకు సాధించాడు. తండ్రి డాక్టర్ షేక్‌ఖాసీంషా మానుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫర్మాన్‌షా సోదరుడు షేక్‌అమాన్‌షా ఎంబైపీసీలో 120 మార్కులకు 116 మార్కులతో రాష్ట్రస్థాయిలో 48వ ర్యాంకు సాధించాడు. ఉత్తమ మార్కులు సాధించిన వారిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు. షేక్‌ఫర్మాన్‌షా, షేక్‌అమాన్‌షా కవలలు.
సివిల్స్ సాధించడమే లక్ష్యం..
పాలిసెట్ రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించా. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో రాణించి భవిష్యత్‌లో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతా. ఐఏఎస్ కావడం నా లక్ష్యం. – షేక్ ఫర్మాన్‌షా


