నగర అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

నగర అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

నగర అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు

కొలను సంతోష్‌రెడ్డి

హన్మకొండ: వరంగల్‌ నగర అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌ రెడ్డి అన్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.4,674 కోట్లు, ఏఐ ఆధారిత ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసిన క్రమంలో శనివారం హనుమకొండలోని అమరవీరుల స్తూపం కూడలిలో ప్రధాని మోదీ కటౌట్‌కు ఆయన పాలాభిషేకం చేశారు. అనంతరం సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కింద రూ.5681 కోట్లకు తుది ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. నాయకులు డాక్టర్‌ కాళీప్రసాద్‌, కందగట్ల సత్యనారాయణ, దొంతి దేవేందర్‌రెడ్డి, గుజ్జుల వసంత, గుజ్జుల మహేందర్‌రెడ్డి, రావుల కోమల, రావుల కిషన్‌, సండ్ర మధు, బైరి శ్రావణ్‌, రాధారపు శివకుమార్‌, నర్మెట శ్రీనివాస్‌, అరణ్య రెడ్డి, బొమ్మసాని అనిల్‌, పిట్టల ధనలక్ష్మి, ఎండీ జరీనా, సుంకరి శ్రీరామ్‌, మూల రాము, సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement