వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026
ఓపీ విధులకు ఆలస్యంగా ఈసీజీ టెక్నీషియన్లు

ఎంజీఎంలో పరీక్షల కోసం

పేషెంట్ల పడిగాపులు

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్లు ఓపీ విధులకు ఆలస్యంగా రావడంతో పేషెంట్లకు ఎదురుచూపులు తప్పలేదు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రావాల్సిన సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కాకపోవడంతో వారి కోసం పేషెంట్లు గంటల తరబడి ఎదురుచూశారు. అసలే వేసవి కావడంతో గంటల తరబడి ఉక్కపోతలో ఎదురుచూడాల్సి వచ్చిందని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నీషియన్లు రాలేదన్న విషయాన్ని సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన టెక్నీషియన్ల ను పిలిపించి ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని మందలించారు. తర్వాత పేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ఈసీజీ పరీక్షలు చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement