● నర్సంపేట ఎమ్మెల్యే
దొంతి మాధవరెడ్డి
నెక్కొండ: నెక్కొండలో రోడ్ల విస్తరణకు అధికారులు సహరించాచాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో ఆర్‌అండ్‌బీ, రైల్వే రోడ్లను రైల్వే అసిస్టెంట్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే దొంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లను విస్తరించి ప్రజలకు సదుపాయాలు కల్పించే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు గోడలను తొలగించి, విస్తరణ పనులు చేపట్టాలని, రైల్వే గోడలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు వివరించారు. రైల్వే ఆర్చీల ఏర్పాటు, మూడో ప్లాట్‌ఫారం వైపు ఫుట్‌ఓవర్ బ్రిడ్జి పెంపు, వీఐపీ విశ్రాంతి హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఎమ్మెల్యే దొంతి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలపై అంజిరెడ్డి సానుకూలంగా స్పందించారు. టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజ్‌కుమార్, నెక్కొండ ఏఎంసీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి, సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, జీపీ కార్యదర్శి సదానందం, ఉప సర్పంచ్ సింగం శ్రావణి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, మండల అధ్యక్షుడు లావుడ్యా తిరుమల్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మాదాటి శ్రీనివాస్, కొణిజేటి భిక్షపతి, ఆవుల శ్రీనివాస్ పాల్గొన్నారు.


