జిల్లాలోని 30 గ్రామాల్లో అత్యధికంగా నీటి వినియోగం
సాక్షి, వరంగల్: జిల్లాలోని 12 మండలాల్లో ఉన్న 30 గ్రామాల్లో అత్యధిక నీటి వినియోగం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ నేలలో ఇంకే నీటి కన్నా తోడుడే అత్యధికంగా ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మండలాల పరంగా చూసుకుంటే జిల్లాలోని 13 మండలాలు అన్నీ సేఫ్ జోన్‌లోనే ఉన్నాయని భూగర్భ జలవనరుల అంచనాలు–2025 నివేదిక వెల్లడించింది. భూగర్భ జలాల లభ్యతలో 70 శాతం వరకు వినియోగముంటే సేఫ్, 70 నుంచి 90 శాతం వరకు సెమీ క్రిటికల్, 90 నుంచి 100 శాతం వరకు క్రిటికల్, 100 శాతం దాటితే అధిక నీటి వినియోగంగా పరిగణించి లెక్కలు కట్టింది. 2024 సంవత్సరంలో వార్షిక భూగర్భ జలవినియోగం 54.96 శాతం ఉంటే.. 2025 సంవత్సరంలో అదీ 58.09 శాతానికి చేరింది. అదేస్థాయిలో భూగర్భజలాల లభ్యత కూడా 2024తో పోల్చితే 2025లో 4691.97 హెక్టా మీటరు అదనంగా లభించిందని గణాంకాలు వెల్లడించాయి. జిల్లాలో సాగునీటి వినియోగం అత్యధికంగా ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో స్వల్పంగా పరిశ్రమలు, గృహ వినియోగానికి ఉంది.
ఏ గ్రామాల్లో అత్యధిక
నీటి వినియోగం అంటే...
వరంగల్ మండలం దేశాయిపేట, గిర్మాజీపేట, రామన్నపేట, ఖిలా వరంగల్ మండలం అల్లీపూర్, రంగశాయిపేట, వర్ధన్నపేట మండలం బండౌతాపూర్, దివిటిపల్లి, కొత్తపల్లి, రాయపర్తి మండలం గన్నారం, కాట్రపల్లి, కేశవపూర్, పోతిరెడ్డిపల్లి, గీసుకొండ మండలం కొమ్మాల, సంగెం మండలం మొండ్రాయి, ముమ్మడివరం, తీగరాజుపల్లి, వెంకటాపూర్ హవేలి, నర్సంపేట మండలం మధిర, ఖానాపురం మండలం కొత్తూరు, రంగంపేట, చెన్నారావుపేట మండలం లింగపూర్, దుగ్గొండి మండలం మధిర మందపల్లి, పొనకల్, నెక్కొండ మండలం బొల్లికొండ, గుండ్రెపల్లి, పనికర, నల్లబెల్లి మండలం నందిగామ, నారక్కపేట, రంగాపురం, రేలకుంట గ్రామాలు అత్యధిక నీటి వినియోగ జాబితాలో ఉన్నాయి. ఈ పల్లెల్లో నీటిని తొడొద్దని భూగర్భ జలవనరుల శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ గ్రామాల్లో ఇంకుడు గుంతల తవ్వకం, వర్షపు నీరు నేలలోకి పోయేలా ఏర్పాటుచేయడం, ప్రజల్లో చైతన్యం తేవడం లాంటి చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ తాజాగా సూచనలు చేశారు.
2024–2025 భూగర్భజలాల
లభ్యత, వినియోగం (హెక్టామీటర్లలో)
4691.97
29,399.27
25,234.71
50,602.5
45,910.53
2025
2024
4164.56
వ్యత్యాసం
2025లో నీటివినియోగం వివరాలు (హెక్టామీటర్లలో)
మొత్తం భూగర్భజల వినియోగం : 29,399.27
వ్యవసాయం : 22,705 (77.23 శాతం)
గృహ వినియోగం : 907 (3.085 శాతం)
పరిశ్రమలు : 1287 (4.377 శాతం)
ఏటా భూమిలో ఇంకే నీటి కన్నా తోడుడే అత్యధికం
మండలాల వారీగా
లెక్క చూసుకుంటే అన్నీ సేఫ్
భూగర్భ జలవనరుల అంచనాలు–2025 నివేదిక వెల్లడి
మండలాల వారీగా నీటి వినియోగం శాతాల్లో...
మండలం 2024 2025
చెన్నారావుపేట 47.93 53.41
దుగ్గొండి 52.65 61.28
గీసుకొండ 59.33 61.33
ఖానాపురం 24.21 29.75
ఖిలా వరంగల్ 60.17 66.90
నల్లబెల్లి 56.83 60.68
నర్సంపేట 56.77 58.87
నెక్కొండ 67.97 66.44
పర్వతగిరి 57.34 56.83
రాయపర్తి 66.50 65.51
సంగెం 56.08 60.05
వరంగల్ 37.59 46.04
వర్ధన్నపేట 58.91 62.21


