నిబంధనలు కఠినం..
● అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, 4X6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకునిరావాలి.
● పెన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు.
● బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు.
● ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్‌లు తీసుకురావొద్దు,
● మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు.
● కాళ్లకు షూ ధరించకూడదు. జీన్స్‌లాంటివి కాకుండా ఇతర సాధారణ దుస్తులు ధరించి రావాలి.
● పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్‌ను తీసుకురావచ్చు.
● డయాబెటిక్ కలిగిన అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు.
● ప్రతి గదిలో, మెయిన్ గేట్‌వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు.
ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఇలా..
● వరంగల్ నిట్‌లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), వరంగల్‌లో సీకేఎం కళాశాల, ఎల్‌బీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల.
● జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో), ప్రభుత్వ జూనియర్ కళాశాల.
● జనగామ జిల్లా కేంద్రంలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయం.
● మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల.
● మహబూబాబాద్‌లో నీట్ నోడల్ ఆఫీసర్‌గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేశ్‌కుమార్ వ్యవహరించనున్నారు.
రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహణ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు
ఉదయం 11 గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి
మధ్యాహ్నం 1–30 గంట తర్వాత నో ఎంట్రీ
హాజరుకానున్న 6,016 మంది అభ్యర్థులు


