తెగిన 11 కేవీ విద్యుత్‌ తీగలు | - | Sakshi
Sakshi News home page

తెగిన 11 కేవీ విద్యుత్‌ తీగలు

May 2 2026 7:20 AM | Updated on May 2 2026 7:20 AM

మామిడి తోటలో చెట్లు, డ్రిప్‌ దగ్ధం

వర్ధన్నపేట: మామిడితోటలో 11 కేవీ విద్యుత్‌ తీగలు తెగిపోయిన సంఘటన శుక్రవారం ఇల్లంద గ్రామంలో జరిగింది. మామిడితోట యజమాని దేవేందర్‌రావు కథనం ప్రకారం.. ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌ ఎదుట ఉన్న మామిడితోటలో 11 కేవీ విద్యుత్‌ తీగలు తెగిపడి మామిడితోటలోని చెట్లు, డ్రిప్‌ పైపులైన్‌ కాలిపోయింది. మామిడితోటలో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం విద్యుత్‌ స్తంభాలు వేసి కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో రాపిడికి గురై విద్యుత్‌ తీగలు తెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ప్రభుత్వం పరిహారం అందించాలని ఆయన కోరాడు.

Advertisement
 
Advertisement
Advertisement