● సీపీ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: పోలీసుల వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల నుంచి ఏసీపీలుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్‌గౌడ్, సార్ల రాజు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్‌ను సీపీ క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈసందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయని పేర్కొన్నారు.


